క్షేత్రం మిల్క్ అండ్ డైరీ వారి ఆధ్వర్యం లో శ్రీ రాజశ్యామల చండియాగం, శ్రీ చక్ర పూజ తేధి “18-03-2021, తిధి పంచమి గురువారం ఉదయం 6 గంటల 30 నిమిషాల – 7 గంటలకు లగాయతు నిర్వహించబడును.

          క్షేత్రం మిల్క్ అండ్ డైరీ వారు సవినయముగా అందరికీ తెలియజేయునది ఏమనగా మేము సేంద్రియ ముడిసరుకులు మరియు నాటు ఆవు ఆధారిత ఉత్పత్తులు మన ఆరోగ్యానికి పర్యావరణానికి మేలు చేసే విధంగా తయారు చేసి అందరికీ అందిస్తున్నాం.

          ఇందులో భాగంగా అందరికీ మన పూర్వ ఆచార పద్దతులను అలవాటు చేయాలనే సదుద్దేశంతో మా  గోశాల కొమ్మాది తర్వాత బోరవానిపాలెం గ్రామంలో మహా చండీ యాగం శ్రీ చక్ర పూజ చేయ నిర్ణయించాము. ఈ యాగంలో 20 హోమ గుండాలు మాత్రమే ఏర్పరచి హోమము చేపట్టాము. 20 హోమగుండాలతో నిర్వహిస్తున్నాము కాబట్టి పరిమితంగా ఇందులో పాల్గొనుటకు వంద మందికి మాత్రమే అవకాశం కల్పించు చున్నాము. ఆసక్తిగలవారు పాల్గొనేందుకు మమ్మల్ని సంప్రదించగలరు. రాజ శ్యామల చండీయాగం అనునది యాగములలోనే శ్రేష్టమైనది. అతి నియమనిష్ఠలతో చేయవలసిన యాగము అనే విషయం అందరికీ తెలిసినదే పాల్గొనదలచిన వారికి కేవలం యాగ హోమ సామాగ్రి నిమిత్తము అయ్యే ఖర్చు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు మాత్రమే చెల్లించి పాల్గొనే అవకాశం ఉంది కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. స్వచ్ఛమైన నాటు ఆవు నెయ్యి, పుట్టతేనె, స్వచ్ఛమైన హోమ ద్రవ్యాలతో చేయబడుతున్న అతి పవిత్రమైన హోమము ఇది. అందరూ బాగుండాలని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశము సస్య శ్యామలంగా ఉండాలని, నిరంతరం ఇలాంటి యాగాలు క్షేత్రం చేపడుతుంది. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిత్యం పాల్గొనదలచిన వారు పరిమిత సభ్యులు కలిగిన ఈ కమిటీలలో చేరదలచిన వారందరినీ ఆహ్వానిస్తున్నాము.

          కేవలం హోమ సామాగ్రికి మాత్రమే మేము ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలుగా నిర్ణయించాము

ఇటువంటి సనాతన కార్యక్రమాలన్నింటినీ క్షేత్రం నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహాయసహకారాలు అందించాలని ప్రార్ధిస్తున్నాము.